Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ఇండియా విమానంలో మహిళతో తాగుబోతు అసభ్య ప్రవర్తన!

  • న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం
  • ఎయిరిండియాను నిలదీసిన బాధితురాలి కుమార్తె
  • చర్యలు తీసుకుంటామన్న విమానయాన సహాయమంత్రి
న్యూయర్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ తాగుబోతు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్యాంటు విప్పి, పక్కనున్న తోటి ప్రయాణికురాలి సీటుపై ఆమె చూస్తుండగానే మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనతో బాధితురాలు హతాశురాలైంది. ఈ దారుణ ఘటనపై ఆమె కుమార్తె ఇంద్రాణి ఘోష్ ట్విట్టర్ ద్వారా ఎయిరిండియాను నిలదీశారు.

'జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మీ విమానం ఏఐ102లో ప్రయాణించిన మా అమ్మ... దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. మందు తాగి ఉన్న ఓ ప్యాసింజర్ ప్యాంటు విప్పి, మా అమ్మ కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఈ ఘటనతో నిశ్చేష్టురాలైంది. ఈ దారుణం పట్ల మీరు స్పందిస్తారని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

దీనిపట్ల కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా స్పందించారు. 'మీ అమ్మకు ఇలాంటి పరిస్థితి ఎదువడం విచారకరం. విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం' అని రిప్లై ఇచ్చారు. 
air indai
passenger
pee

More Telugu News