kohli: టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

  • టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన కోహ్లీ
  • 119 ఇన్నింగులలో 6 వేల పరుగులు
  • 120 ఇన్నింగులలో ఈ ఘనతను సాధించిన సచిన్
సౌతాంప్టన్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లీ... టెస్టుల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఆటగాళ్లలో 119 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (120)ను వెనక్కి నెట్టేశాడు. 117 ఇన్నింగ్స్ లలో ఆరు వేల పరుగులను పూర్తి చేసిన గవాస్కర్ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతలను సాధించిన వారిలో డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం 68 ఇన్నింగ్స్ లలోనే ఆయన ఈ ఘనతను సాధించారు. 
kohli
Sachin Tendulkar
team india

More Telugu News