jenasena: టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ‘జనసేన’ వైపు చూస్తున్నారు: సీపీఎం మధు

  • పొత్తులపై చర్చలు ఎన్నికల సమయంలోనే
  • ప్రజా సమస్యలపై ‘జనసేన’తో కలిసి పోరాడుతున్నాం
  • రాష్ట్రంలో పెనుమార్పులు రానున్నాయి
ఏపీలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని సీపీఎం నేత మధు వ్యాఖ్యానించారు. పొత్తులపై చర్చలు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, ప్రస్తుతం ప్రజా సమస్యలపై ‘జనసేన’తో కలిసి పోరాటం చేస్తున్నామని, రాష్ట్రంలో పెనుమార్పులు రానున్నాయని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీపై ఆయన ఆరోపణలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారని, యువకులపై రౌడీషీట్లు తెరవడం దారుణమని, ఇలా చేయడం కరెక్టు కాదని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.
jenasena
cpm
madhu

More Telugu News