raghunatha reddy: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి భార్య కన్నుమూత!

  • కొంతకాలంగా ఆమెకు అనారోగ్యం
  • బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో మృతి
  • పల్లె రఘునాథరెడ్డికి చంద్రబాబు పరామర్శ
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి భార్య ఉమ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆసుపత్రికి వెళ్లి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. రఘునాథరెడ్డిని పరామర్శించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రఘునాథరెడ్డిని పరామర్శించి తమ సానుభూతి తెలియజేశారు.కాగా, పల్లె రఘునాథరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు అన్ని విధాలా ఉమ అండగా ఉండేవారు. గతంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె పోటీ చేసిన సమయంలో ఆమె రెండుసార్లు ప్రచారం చేశారు. అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డికి ఉన్న విద్యా సంస్థల లావాదేవీలను ఉమ చూసుకునేవారు. పల్లె ఉమ మృతిపై ఆ విద్యాసంస్థలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, పుట్టపర్తి వాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
raghunatha reddy
Andhra Pradesh

More Telugu News