vijayasai reddy: ప్రజా సంకల్ప యాత్రలో మరో అపూర్వ ఘట్టమిది!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 250 రోజులు 
  • 11 జిల్లాలలో 2848 కిలోమీటర్లు నడిచిన జగన్
  • ప్రతి అడుగు రేపటి శుభోదయానికి బాటలు కావాలి
గత ఏడాది నవంబర్ 6న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 250 రోజులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ సుదీర్ఘ యాత్రలో ప్రతి నిత్యం ప్రజల గుండె చప్పుళ్ళు, అన్నార్తుల ఆక్రోశాన్ని ఆలకిస్తూ, వారిని తన గుండెకు హత్తుకుని భరోసా ఇస్తూ.. అధినేత వేస్తున్న ప్రతి అడుగు రేపటి శుభోదయానికి, అభ్యుదయానికి బాటలు కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
vijayasai reddy
ys jagan

More Telugu News