hari krishna: తండ్రి చితికి నిప్పు పెట్టిన కల్యాణ్ రామ్.. ముగిసిన అంత్యక్రియలు

  • ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
  • శాశ్వతంగా నింగికెగసిన మహోన్నత వ్యక్తి
  • గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
దివంగత హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తన తండ్రి హరికృష్ణ చితికి కల్యాణ్ రామ్ నిప్పు పెట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు. కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య తుది అంకం ముగిసింది. ఇక సెలవు అంటూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన హరికృష్ణ శాశ్వతంగా మన నుంచి దూరమయ్యారు. అంత్యక్రియలు ముగియడంతో బాధాతప్త హృదయంతో ఒక్కొక్కరు అక్కడ నుంచి బయటకు వస్తున్నారు.
hari krishna
funerals

More Telugu News