Uttam Kumar Reddy: హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్
  • రాహుల్ గాంధీని కలవనున్న టీపీసీసీ అధ్యక్షుడు
  • భేటీలో పాల్గొననున్న కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉత్తమ్ కలుస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జరగనున్న భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్, టీపీసీసీకి యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Uttam Kumar Reddy
delhi

More Telugu News