hari krishna funerals: మహాప్రస్థానానికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయం

  • ముగిసిన అంతిమయాత్ర
  • కాసేపట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • భారీగా తరలి వచ్చిన అభిమానులు
దివంగత హరికృష్ణ అంతిమయాత్ర ముగిసింది. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి ఆయన పార్థివదేహం చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర చేరుకుంది. రథం నుంచి పార్థివదేహం పాడెను ముఖ్యమంత్రి కూడా మోశారు. కాసేపట్లో హిందూ సంప్రదాయం ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. దహనం కోసం గంధపుచెక్కలతో ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. 4 గంటలకు అంత్యక్రియల కార్యక్రమం మొదలు కానుంది. 
hari krishna funerals

More Telugu News