Nara hamara-Telugudesam Hamara: ‘నారా హమారా-టీడీపీ హమారా’ సభలో గొడవకు యత్నించిన వైసీపీ.. 9 మంది అరెస్ట్!
- గుంటూరు సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ యత్నం
- నంద్యాల వైసీపీ నేత హబీబుల్లా ప్రోత్సాహంతోనే
- పోలీసుల విచారణలో వెల్లడి
గుంటూరులో టీడీపీ నిర్వహించిన ‘నారా హమారా-టీడీపీ హమారా’ సభలో గొడవకు దిగిన 9 మందిని వైసీపీ వర్గీయులుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల వైసీపీ నాయకుడు హబీబుల్లా ప్రోత్సాహంతో వీరు సాధారణ కార్యకర్తల్లా సభకు చేరుకుని గొడవకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకోసం పథకం ప్రకారం ఖాళీ చార్టులు, స్కెచ్‌లు వెంట తెచ్చుకున్నారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి వ్యతిరేక నినాదాలు చేశారు.
వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత పాతగుంటూరు స్టేషన్‌కు, ఆ తర్వాత నల్లపాడు స్టేషన్‌కు తరలించి విచారించారు. నంద్యాల వైసీపీ నేత హబీబుల్లా ప్రోత్సాహంతో వారు నిరసన చేపట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. టీడీపీ నేత షేక్ మీరావలి ఫిర్యాదుతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.