Tirumala: 12 నుంచి 21 వరకూ తిరుమలలో ప్రత్యేక, వీఐపీ దర్శనాల నిలిపివేత!

  • 12 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • ఆర్జిత సేవలన్నీ నిలిపివేత
  • 3వ తేదీన గోకులాష్టమి ఆస్థానం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి 21 వరకూ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. నిత్యమూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు వయసున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పించే దర్శనాలను కూడా రద్దు చేశామని పేర్కొంది. భక్తులు సహకరించాలని కోరింది. కాగా, 3వ తేదీన గోకులాష్టమి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ఆస్థానం వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది.
Tirumala
Tirupati
TTD
Brahmotsavams

More Telugu News