Chandrababu: చంద్రబాబు పక్కన దిగాలుగా కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో చూడండి

  • కామినేని ఆసుపత్రిలో ఒక గదిలో కూర్చున్న కుటుంబసభ్యులు
  • చంద్రబాబుకు అటూఇటుగా కూర్చున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • గదలో లోకేష్, బాలయ్య
తాము ఎంతో ప్రేమించే కన్నతండ్రిని కోల్పోయిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తల్లడిల్లి పోయారు. కామినేని ఆసుపత్రిలో తండ్రి భౌతికకాయాన్ని చూసి భోరున విలపించారు. వారు వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ, మరి కొంత సమయానికి చంద్రబాబు, నారా లోకేష్ లు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఓ గదిలో వారు కూర్చున్నారు.

 ఈ సందర్భంగా చంద్రబాబుకు అటూఇటూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూర్చున్నారు. ఎదురుగా బాలకృష్ణ, మరో సీటులో లోకేష్, ఇంకొక సీటులో తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు గదిలోని వారంతా ఎంతో దిగాలుగా ఉన్నారు. అనంతరం ఆసుపత్రి వర్గాలు అక్కడకు వచ్చి మాట్లాడటం, ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏదో సూచిస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.
Chandrababu
junior ntr
kalyan ram
Nara Lokesh
Balakrishna

More Telugu News