హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి...రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ ట్వీట్స్

  • హరికృష్ణ వార్త తెలిసి షాకయ్యా: రామ్ చరణ్
  • తారక్ కు, నందమూరి ఫ్యామిలీకి తీరని నష్టం: విజయ్ 
  • తారక్, కల్యాణ్ రామ్, నందమూరి ఫ్యామిలీకి నా సానుభూతి: ప్రభాస్
టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతిపై టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరు ట్వీట్లు చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చెందారన్న వార్త తెలిసి షాకయ్యానని, తీవ్ర విషాదానికి గురిచేసిందని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నాడు.  

హరికృష్ణ మృతి వార్త తెలిసి తీవ్ర దు:ఖం పొందానని, తారక్, కల్యాణ్ రామ్, నందమూరి కుటుంబానికి తన సానుభూతి తెలుపుతున్నానని ప్రభాస్; తారక్ అన్నకు, నందమూరి కుటుంబానికి తీరని నష్టం జరిగిందని హీరో విజయ్ దేవరకొండ తన సంతాపం తెలిపాడు.

నందమూరి హరికృష్ణ మృతి తనకు వ్యక్తి గతంగా తీరనిలోటని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన సంతాపం తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ఓ ట్వీట్ లో తెలిపాడు.



 
Go Back to Shorts
hari krishna
ram charan
Prabhas
vijay devera konda

More Telugu News