ఢిల్లీలో రికార్డు స్థాయికి చేరుకున్న డీజిల్ ధర.. వాహనదారుల గుండెలు గుభేల్!
- లీటర్ డీజిల్ ధర రూ.69.46
- మే తర్వాత ఇదే అత్యధికం
- ముంబైలో రూ.73.74
ఢిల్లీలో సేల్స్ ట్యాక్స్, వ్యాట్ చాలా తక్కువగా ఉండడంతో దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ధర చాలా తక్కువగా ఉంటుంది. కాగా, ఈ ఏడాది మే 29న ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.31కి చేరుకుంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, తాజాగా రూ.69.46కు చేరుకుని దానిని అధిగమించింది.