Hyderabad: నడిరోడ్డుపై పైశాచికం... భర్తపై కోపంతో పసిబిడ్డను నేలకేసి కొట్టిన తల్లి వీడియో!

  • పుట్టిన బిడ్డ తనవాడు కాదన్న తండ్రి
  • నడిరోడ్డుపై పంచాయితీ
  • తన కోపాన్ని బిడ్డపై చూపించిన తల్లి
భర్త తనను అనుమానించాడన్న ఆగ్రహంతో, నడిరోడ్డుపై పైశాచికంగా ప్రవర్తించిందో తల్లి. హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదని భార్యను అనుమానిస్తూ ఓ భర్త నడిరోడ్డుపై పంచాయితీ పెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు వారిద్దరినీ వారిస్తుండగానే, తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, తన ఒడిలో ఉన్న పసికందును నేలకేసికొట్టింది.

ఈ ఘటనలో బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కొందరు జరుగుతున్న గొడవను గమనించి, వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. గాయాలపాలైన బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పలు తెలుగు వార్తా చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.
Hyderabad
Mehidipatnam
Wife and Husbend
Dispute

More Telugu News