చేతులెత్తేసిన సైనా... విజయంతో ఫైనల్స్ లో సింధూ!
- సెమీస్ కు పరిమితమై కాంస్యంతో సరిపెట్టుకున్న సైనా నెహ్వాల్
- యమగూచిపై విజయంతో ఫైనల్స్ లో సింధు
- ఫైనల్ లో తై జూ యింగ్ తో పోరాడనున్న సింధు
- గెలిస్తే స్వర్ణం, లేకుంటే రజతం ఖాయం
ఇదే సమయంలో పూర్తి అటాకింగ్ గేమ్ ను ఆడుతూ, సివంగిలా కోర్టంతా కలియదిరుగుతూ ప్రత్యర్థి అకానే యమగూచిని ముప్పుతిప్పలు పెట్టిన తెలుగుతేజం పీవీ సింధు సగర్వంగా ఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది. తొలి సెట్ ను 21-17 తేడాతో గెలుచుకున్న సైనా, రెండో సెట్ లోనూ తనదైన ఆటతీరును ప్రదర్శించలేక 21-15 తేడాతో ఓడిపోయింది. ఆపై నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సింధూ 9-5 లీడ్ లో ఉన్నప్పుడు 41 స్ట్రోక్ ర్యాలీ జరిగింది. దానిలో గెలిచి 10-5 లీడ్ లోకి వెళ్లిన సింధూ, ఆపైనా అదే ఊపును కొనసాగించింది. 21-10 తేడాతో మూడో సెట్ ను గెలుచుకుంది.
ఫైనల్స్ లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ను ఓడించిన తై జు యింగ్ లు తలపడనున్నారు.