'మణిగంధం బహిర్ముఖం... సారీ మిస్టర్ రాజమౌళి' అంటున్న 'సిల్లీ ఫెలోస్'... ట్రైలర్ ను విడుదల చేసిన మహేశ్ బాబు!
- రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్రైలర్ విడుదల
- నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేశ్, సునీల్
- అంచనాలు పెంచిన ట్రైలర్
నరేశ్, హీరోయిన్ ఫైట్ చేస్తూ, "మణిగంధం బహిర్ముఖం" అంటూ 'బాహుబలి' డైలాగ్ చెప్పగానే, పోసాని కృష్ణమురళి నోటి నుంచి 'సారీ మిస్టర్ రాజమౌళి' అని వినిపించడం ఆకట్టుకుంటోంది. ఎక్స్ రేను చూసి స్కానింగ్ రిపోర్టు ఏం చెబుతోందని బ్రహ్మానందం అడగటం నవ్వులు పూయిస్తోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. దాన్ని మీరూ చూసేయండి.