సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న కోమటి రెడ్డి, సంపత్ కుమార్!
- హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న నేతలు
- సింగిల్ జడ్జీ తీర్పు అమలును కోరే అవకాశం
- ధ్రువీకరించిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు
ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టులో అప్పీల్ దాఖలుచేశారు. ఈ పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్ పై తదుపరి విచారణను నిలుపుదల చేసింది.
హైకోర్టు తమ అసెంబ్లీ సభ్యత్వాల పునరుద్ధరణను నిలిపివేయడంపై కాంగ్రెస్ నేతలు సంపత్, కోమటి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.