ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం.. రోయింగ్ లో సత్తా చాటిన యువ జట్టు
- రోయింగ్ క్వాడ్రఫుల్ ఈవెంట్ లో స్వర్ణం
- డబుల్ స్కల్స్ పోటీలో కాంస్యం
- ఇప్పటివరకూ 21 పతకాలు గెలుచుకున్న భారత్
రోయింగ్ లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఈవెంట్ లోనూ భారత జట్టుకు కాంస్యం లభించింది. రోహిత్ కుమార్, భవవాన్ దాస్ జట్టు ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. ఏషియన్ గేమ్స్ లో భారత జట్టు ఇప్పటివరకూ 5 స్వర్ణం, నాలుగు రజతం, 12 కాంస్య పతకాలను(మొత్తం 21) గెలుచుకుంది.