బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది: తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపణ
- తేజ్ ప్రతాప్ చేతిని పట్టుకున్న ఆయుధాలు కలిగిన వ్యక్తి
- గమనించి కేకలు వేసిన డ్రైవర్
- తనను చంపేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేశాయన్న తేజ్ ప్రతాప్
ఆయుధాలు కలిగిన వ్యక్తి తేజ్ ప్రతాప్ చేతిని పట్టుకున్న విషయాన్ని తొలుత అతని డ్రైవర్ గుర్తించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా అరవడంతో అందరూ అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.
మరోవైపు, తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, తేజ్ ప్రతాప్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, తమ్ముడు తేజశ్వి యాదవ్ రాజకీయంగా అతనికన్నా ఎదుగుతుండటంతో నిరాశలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.