సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అనుష్కను ఫైనల్ చేసిన కొరటాల
- రాజమహేంద్రవరంలో సూర్య షూటింగ్
- దసరాకి వస్తున్న 'అదుగో'!
* తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న 'ఎన్.జి.కె' (నంద గోపాలన్ కుమరన్) చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ రేపటి నుంచి రాజమహేంద్రవరంలో జరుగుతుంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* నటుడు, దర్శకుడు రవిబాబు రూపొందించిన 'అదుగో' చిత్రం దసరాకు విడుదల కానుంది. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని భారతీయ భాషలన్నిటిలోనూ విడుదల చేయనున్నారు.