Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మానాన్నలకి ఆర్థికంగా సాయపడలేక బాధపడ్డాను: కిరాక్ ఆర్పీ

  • పదేళ్ల పాటు ఇంట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు 
  • అయినా అమ్మానాన్నలు ఏమీ అనలేదు 
  • వాళ్లు పడుతోన్న బాధలు నాకు చెప్పలేదు  
కిరాక్ ఆర్పీ ఎన్నో కష్టాలను .. మరెన్నో ఇబ్బందులను అధిగమించి, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ విషయాలను గురించి తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. "నేను జబర్దస్త్ కి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. అంతకు ముందు తొమ్మిదేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. అయినా వాటిని ఎదుర్కుంటూ నేను నిలదొక్కుకోవడానికి కారణం నా తల్లిదండ్రులు.

మా అమ్మకి బాగోలేదని తెలుసు .. మా నాన్నకి చూపు సరిగ్గాలేదని తెలుసు .. మా అన్నయ్య దగ్గర డబ్బు లేదని తెలుసు. ఇవన్నీ తెలిసినా నేను వెనక్కి వెళ్లలేను .. అలా వెళితే ఇక్కడున్న ఆధారం కాస్తా పోతుంది. తిరిగి వెళ్లినా నేను వాళ్లకి ఏమీ చేయలేను. అలా ఆర్థికపరమైన తోడ్పాటును నేను 10 యేళ్లపాటు అందించకపోయినా నా తలిదండ్రులు నన్ను ఏమీ అనలేదు. నేను ఒక్క రూపాయి ఇవ్వకపోయినా అంతే ప్రేమతో చూశారు. వాళ్ల కష్టనష్టాలు నాకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. 'ఏమీ సంపాదించకుండా అక్కడ ఏం చేస్తున్నావ్ .. వెనక్కి వచ్చేయ్' అనలేదు. అలా నేను ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్లు కారకులయ్యారు" అని చెప్పుకొచ్చాడు.   
kirak rp

More Telugu News