modi: సీబీఐ కేసులకు కేసీఆర్ భయపడుతున్నారు: పొన్నం ప్రభాకర్

  • మోదీకి కేసీఆర్ భయపడుతున్నారు
  • రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
  • బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కయింది
తన అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపిస్తారనే భయంతోనే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నానాటికీ ప్రజాదరణ తగ్గుతోందని అన్నారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 
modi
kcr
cbi
Ponnam Prabhakar

More Telugu News