Chiranjeevi: టి. సుబ్బరామిరెడ్డిని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  • సుబ్బరామిరెడ్డికి విదేశాలలో మోకాలు శస్త్ర చికిత్స
  • హైదరాబాదులో ఆయన ఇంటికి వెళ్లిన చిరు  
  • 'సైరా' టీజర్ అద్భుతంగా ఉందన్న సుబ్బరామిరెడ్డి
రాజ్యసభ సభ్యుడు డా. టి. సుబ్బరామిరెడ్డికి ఇటీవల విదేశాలలో మోకాలు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం నగరానికి విచ్చేసిన సుబ్బరామిరెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని సుబ్బరామిరెడ్డి ప్రశంసించారు. అలాగే, చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సైరా చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

Chiranjeevi
subbaramireddy
Congress
Hyderabad

More Telugu News