కృష్ణా నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు.. స్థానికుల గాలింపు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో విషాదం అలముకుంది. కృష్ణా నదిని చూసేందుకు అక్కడకు పలువురు విద్యార్థులు వచ్చారు. ప్రమాదవశాత్తు వీరిలో ముగ్గురు విద్యార్థులు నదిలో పడిపోయారు. కొట్టుకుపోతున్న వారిని చూసిన విద్యార్థులు, చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో... స్థానికులు అక్కడకు పరుగుపరుగున వచ్చారు. అప్పటికే వారి ఆచూకీ గల్లంతైంది. వారు కనిపించకుండా పోయారు. వారికోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News