విద్యార్థినిపై కరస్పాండెంట్ లైంగిక వేధింపులు... నిజమేనన్న భార్య!
- ఇంటికి పిలిచి వేధింపులు
- కరస్పాండెంట్ కే మద్దతిచ్చిన ప్రిన్సిపాల్
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ప్రిన్సిపాల్ గ్లోరీ సైతం తమకు మద్దతు తెలపకుండా, కరస్పాండెంట్ కే మద్దతిచ్చారని ఆరోపిస్తూ, పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కాగా, విద్యార్థినికి మద్దతు తెలిపిన నిందితురాలి భార్య, గతంలోనూ నరిసింహ కుమార్ పై మూడు లైంగిక వేధింపుల కేసులున్నాయని తెలిపింది. నర్సీపట్నంలో కళాశాలను నడిపిన వేళ, పోలీసు కేసులు నమోదైనాయని, అక్కడ కాలేజీలు మూసి ఇక్కడికి వచ్చాడని చెప్పిన ఆమె, కాలేజీ ప్రిన్సిపాల్ గ్లోరీ తన భర్తతో సంబంధం పెట్టుకుందని ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని, వారిద్దరికీ శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేసింది.