geetha govindam: బన్నీ సార్.. మీరు చెప్పిందంతా నిజమే: దర్శకుడు హరీష్ శంకర్

  • 'గీత గోవిందం' సినిమాను న్యూజెర్సీలో చూశా
  • సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు
  • విజయ్ దేవరకొండ.. నీకు నీవే సాటి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని ప్రశంసించాడు. న్యూజెర్సీలో ఈ చిత్రాన్ని చూశానంటూ హరీష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. సోమవారం సాయంత్రం థియేటర్ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయిందని చెప్పాడు.

నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారని హరీష్ కొనియాడాడు. గీతా ఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు పరశురామ్ కు, నటీనటులకు, టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపాడు. విజయ్ దేవరకొండ... నీకు నీవే సాటి అంటూ కితాబిచ్చాడు. నీ నడక తీరు, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ సూపర్బ్ అని కొనియాడాడు. ఇలాంటి మరెన్నో చిత్రాల్లో విజయ్ నటించాలని ఆశిస్తున్నానని చెప్పాడు.

'రష్మిక.. మీ నటన చాలా బాగుంది. ఇప్పుడు మీరొక స్టార్. ఈ ఇండస్ట్రీలో మీరు ఎంతో కాలం ఉంటారు' అంటూ హరీష్ ప్రశంసించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ తనకు ఈ చిత్రం గురించి చెబుతూనే ఉన్నాడని గుర్తు చేసుకున్నాడు. 'బన్నీ సార్... కంగ్రాట్స్. ఈ సినిమా గురించి మీరు చెప్పిందంతా నిజమే' అంటూ ట్వీట్ చేశాడు. 
geetha govindam
harish shankar
Allu Arjun
vijay devarakonda
rashmika mandana

More Telugu News