lorry: గుంటూరు జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ!

  • నాదెండ్ల మండలం గణపవరంలో ప్రమాదం
  • ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నాదెండ్ల మండలం గణపవరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 
lorry
house
Guntur District
accident

More Telugu News