Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఫుల్ బిజీ!

  • ఉదయం 9.30కి యూఎస్ అంబాసిడర్ తో భేటీ
  • ఆపై 10.30కి వీడియో కాన్ఫరెన్స్
  • నాలుగింటికి సాక్షరతా మిషన్ పై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఫుల్ బిజీగా గడపనున్నారు. ఈ ఉదయం 9.30కి అమెరికా అంబాసిడర్ కెన్నెత్ జస్టర్ తో భేటీ కానున్న ఆయన, ఆపై ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టరతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న ఆయన, గ్రామదర్శిని, వర్షాలు, వరదలు తదితర 10 అంశాలపై మాట్లాడనున్నారు.

ఆపై మధ్యాహ్న భోజన విరామం తరువాత 4 గంటలకు సాక్షరతా మిషన్ పై సమీక్ష జరపనున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాస్ తో పాటు విద్యా శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఆపై సాయంత్రం 4.30 గంటల నుంచి సంక్షేమ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష జరపనున్నారు.
Andhra Pradesh
Chandrababu
Review
Busy

More Telugu News