vijay devarakonda: విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా' లీక్.. హెచ్ డీ ప్రింట్ బయటపెట్టిన లీకు వీరులు!

  • ట్యాక్సీవాలా సినిమా ఎడిట్ కు ముందే లీక్
  • యూట్యూబ్, సోషల్ మీడియాలో అప్ లోడ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు
ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సీన్లను లీక్ చేసిన దుండగులు.. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాను రిలీజ్ కు ముందే బయటపెట్టారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ‘ట్యాక్సీవాలా’కు షాక్ తగిలింది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొందరు దుండగులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్ కు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ట్యాక్సీవాలా లీక్ కావడంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గూగుల్ డ్రైవ్ నుంచి సినిమా లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ-మెయిల్ అకౌంట్ల ద్వారా ఈ వీడియో లింక్ లు షేర్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు.
vijay devarakonda
taxiwala
Tollywood
leak
google drive

More Telugu News