కేరళలో 'శైలజా రెడ్డి అల్లుడు' రీరికార్డింగ్.. రిలీజ్ డౌటే?
- కేరళను ముంచెత్తుతోన్న వరదలు
- అక్కడ జరుగుతోన్న రీ రికార్డింగ్ కి అంతరాయం
- అక్కడే ఉండిపోయిన మారుతి
అక్కడి పరిస్థితులు అతలాకుతలం కావడంతో రీ రికార్డింగ్ పనులకు అంతరాయం కలిగింది. అక్కడి రీ రికార్డింగ్ పనులు ఆగిపోవడం .. అక్కడ మారుతి చిక్కుబడటం వలన, ఆయన ఇక్కడ చేయవలసిన పనులు కూడా ఆగిపోయాయి. అనుకోకుండా వచ్చిన ఈ అవాంతరం వలన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయలేకపోతే, సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావలసి వుంది.