రహస్యంగా పెళ్లి చేసుకుని మోసం... అత్తింటి ముందు బైఠాయించిన యువతి!
- హైదరాబాద్ లో పని చేస్తున్న దేవీ కుమారి, వెంకటేశ్వర్లు
- రహస్యంగా గుడిలో వివాహం
- ఆపై తీసుకెళ్లకపోవడంతో యువతి నిరసన
పెళ్లయి నెల రోజులు గడుస్తున్నా వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో, ఆ అమ్మాయి అత్తారింటికి వచ్చింది. ఇంటి ముందు నిరసనకు దిగింది. పోలీసులు వచ్చి విచారించగా, తనకు కేసులు వద్దని, న్యాయం చేయాలని కోరింది. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకు రెండు నెలల క్రితమే మరో అమ్మాయితో పెళ్లి జరిగిందని, దేవీ కుమారితో తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, వారు వచ్చిన తరువాత తదుపరి విచారణ కొనసాగిస్తామని అంటున్నారు.