ఆన్ లైన్ లక్కీడిప్ కూడా అక్రమార్కుల పాలు... తిరుమల సేవా టికెట్ల కుంభకోణం వెనుక మరిన్ని నిజాలు!
- వేల ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్లు
- నెలకు కనీసం 100 టికెట్లు పొందుతున్న దళారీ
- వాటిని అధిక ధరకు విక్రయిస్తూ లాభార్జన
పట్టణానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి, వేలాది మంది ఆధార్ కార్డు నంబర్లను సేకరించి, ప్రతి నెలా ఆన్ లైన్ డిప్ కు అందరి పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు. వేల సంఖ్యలో ఉన్న రిజిస్ట్రేషన్లలో కనీసం 100 వరకూ టికెట్లు ప్రభాకర్ రిజిస్టర్ చేసిన ఆధార్ నంబర్లకు దక్కుతుండగా, వాటిని అధిక ధరకు విక్రయించి, ఆపై టికెట్ పొందిన అసలు వ్యక్తి పేరిట ఉన్న ఆధార్ కార్డుకు నకిలీ కార్డు తయారు చేసి టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తికి ఇచ్చి పంపుతుంటాడు.
గత నవంబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్టు గుర్తించిన అధికారులు, ఇదే తరహాలో దళారీలు చెన్నై, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఉండివుండవచ్చని అనుమానిస్తున్నారు.