రాజీవ్ శుక్లా వేసిన ప్రశ్న విని కన్నీరు పెట్టిన వాజ్ పేయి!
- తొలిసారిగా ప్రధాని కాబోతున్న వేళ ఇంటర్వ్యూ చేసిన శుక్లా
- ప్రజలకు దూరమవుతున్నానని కన్నీరు
- నిష్కళంక రాజకీయ నేత వాజ్ పేయని కొనియాడిన శుక్లా
ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు కూడా సౌకర్యవంతంగా కనిపించేవని, కక్షపూరిత చర్యలకు ఆయన వ్యతిరేకమని, అందువల్లే ఆయనంటే ఎంతో మందికి ప్రేమని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సమకాలీన రాజకీయ నేతలతో పోలిస్తే, ఆయన ఆలోచనా ధోరణి విభిన్నమైనదని చెప్పారు. నేటి తరం నేతలు ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సివుందని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాల్లోని మంచి లక్షణాలను అందిపుచ్చుకుని ఎదిగిన వాజ్ పేయి, గొప్ప వక్తని కొనియాడారు.