ఎన్టీఆర్ నివసించిన ఇంట్లో బయోపిక్ షూటింగ్!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • ప్రత్యేక ఆకర్షణగా రకుల్ 
  • సంక్రాంతికి భారీ రిలీజ్
'ఎన్టీఆర్' జీవితచరిత్ర క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ ఇంట్లో జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ అబిడ్స్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉండేవారు. ఎన్టీఆర్ అక్కడ ఉండగా జరిగిన కొన్ని సన్నివేశాలను అక్కడే ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా షూటింగులో జాయిన్ కాగా, హరికృష్ణ పాత్ర కోసం త్వరలో కల్యాణ్ రామ్ షూటింగులో పాల్గొననున్నాడు. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. రకుల్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.  
Go Back to Shorts
balakrishna
vidya balan
rakul

More Telugu News