KTR: కేటీఆర్ ను పొగడుతూ, లోకేశ్ పై పవన్ కల్యాణ్ విసుర్లు!

  • కేటీఆర్ కు ప్రజల కష్టాలు తెలుసు
  • ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన నేత కేటీఆర్
  • లోకేశ్ కు ఏం అనుభవం ఉంది?
  • ప్రశ్నించిన జనసేనాని
రాజకీయ నాయకులు ఎలా ఉండాలో చెబుతున్న వేళ, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, చంద్రబాబు కుమారుడు లోకేశ్ లను పోలుస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు తెలుసుకుని, ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వారే రాజకీయాల్లోకి రావాలని వ్యాఖ్యానించిన ఆయన, కేటీఆర్ కు పోరాడిన అనుభవం ఉందని అన్నారు.

 ప్రజల మనసులను గెలిచిన ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేందుకు కావాల్సిన అనుభవం ఉందని పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్ కు ఏం అనుభవం ఉందని ప్రశ్నించిన పవన్, ఏ అర్హతతో ఆయన సీఎం అవాలని అనుకుంటున్నారని అడిగారు. లోకేశ్ తాత ఎన్టీఆర్ కూడా 60 ఏళ్లు దాటిన తరువాత మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో తన పార్టీకి బలం ఉందని భావించిన చోట్ల తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలుపుతామని వ్యాఖ్యానించిన పవన్, మిగతా ప్రాంతాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తామని తెలిపారు.
KTR
Nara Lokesh
Pawan Kalyan
Telangana

More Telugu News