keerthi suresh: 100 రోజులు పూర్తి చేసుకున్న 'మహానటి'.. థ్యాంక్స్ చెప్పిన టీమ్!

  • సావిత్రి బయోపిక్ గా 'మహానటి'
  • మే 9వ తేదీన భారీ విడుదల 
  • అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ   
'మహానటి'గా ఎంతోమంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సావిత్రి, వైవాహిక జీవితంలో మానసికపరమైన ఒత్తిడికి లోనయ్యారు. ఆరోగ్యం దెబ్బతినడంతో ఇటు సినిమాలకు .. అటు అభిమానులకు ఆమె శాశ్వతంగా దూరమయ్యారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రను 'మహానటి'గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. సావిత్రిని అభిమానించే ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు తెప్పించింది.

మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇంతగా ఆదరణ పొందుతూ, ఈ రోజుతో 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఇంతటి అఖండమైన విజయాన్ని సాధించడం పట్ల ఈ సినిమా  టీమ్ హర్షాన్ని ప్రకటించింది. "మీ ఆశీర్వచన బలంతో .. ఆదరాభిమానాలతో ప్రపంచ వ్యాప్త విజేతగా నిలిచి, 100 రోజుల పండుగ జరుపుకుంటోన్న ఈ శుభ సందర్భంలో, ప్రేక్షక దేవుళ్లందరికీ ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.  
keerthi suresh
samanta

More Telugu News