శ్రీశైలానికి భారీ వరద... కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు!
- 2 లక్షల క్యూసెక్కులకు పెరిగిన తుంగభద్ర వరద
- నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు
- నాగార్జున సాగర్ కు 70 వేల క్యూసెక్కుల నీరు
మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 157 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండాలంటే, మరో 58 టీఎంసీల నీరు అవసరం. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్ కు 69,913 క్యూసెక్కుల నీటిని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరో 4 వేల క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు.