భయపడొద్దు.. విదేశీ కరెన్సీ నిల్వలు దండిగా ఉన్నాయ్!: దేశ ప్రజలకు జైట్లీ అభయం
- రూపాయి విలువ పడిపోవడంపై స్పందించిన మంత్రి
- విదేశీ కరెన్సీ నిల్వలు కావాల్సినంత ఉన్నాయని వెల్లడి
- అంతర్జాతీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్న జైట్లీ
అమెరికా ఆంక్షల నేపథ్యంలో టర్కీ కరెన్సీ లీరా విలువ కూప్పకూలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో డాలర్ కు రూపాయి విలువ రూ.70.09 కి పడిపోయింది. ఇది ఆల్ టైం గరిష్టం కావడం గమనార్హం. కాగా, అంతర్జాతీయ పరిస్థితులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జైట్లీ తెలిపారు. మరోవైపు ప్రస్తుతం దేశంలో 402.7 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.