ఓవైపు ఆనందంగా ఉంది.. మరోవైపు దుఃఖం పొంగుకొస్తోంది: మోదీ
- దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందుకు ఆనందంగా ఉంది
- మరోవైపు వరదలు బాధిస్తున్నాయి
- ఎర్రకోటపై నుంచి కొనసాగుతున్న మోదీ ప్రసంగం
దేశం ఈ రోజు గరిష్ఠ స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తోందని మోదీ వివరించారు. వీటితోపాటు మొబైల్ ఫోన్లనూ భారత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. సంపద సృష్టిలో యువత కొత్తదారుల వెంట పరుగులు తీస్తోందన్న మోదీ..13 కోట్ల మంది ముద్రా రుణాలు తీసుకుంటే అందులో 4 కోట్ల మంది యువతే ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. స్టార్టప్‌లను ప్రారంభించేవారిలోనూ 99 శాతం మంది యువతే ఉన్నారని తెలిపారు. డిజిటల్ ఇండియాలో 3 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయన్నారు. మంగళయాన్ విజయంతో మన శాస్త్రవేత్తల కృషిని ప్రపంచానికి చాటామని, మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టి కలలను సాకారం చేసి చూపించాల్సి ఉందన్నారు.