కేరళలో ఏనుగు ప్రాణాలు కాపాడేందుకు... ప్రాజెక్టు గేట్ల మూసివేత!
- కేరళలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- అతిరాపల్లి వద్ద వరదలో చిక్కుకున్న ఏనుగు
- మూడు గంటల పాటు ప్రాజెక్టు గేట్ల మూసివేత
దీన్ని గమనించిన ప్రజలు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చినా, ఏనుగును ఎలా కాపాడాలో తెలియక, జలపాతంలోకి నీటిని విడుదల చేసే పెరింగల్ కోత్ డ్యామ్ నిర్వహణా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు మూడు గంటల పాటు గేట్లను మూసివేయగా, వరద నీరు తగ్గింది. అప్పటికీ ఏనుగు కదలక పోవడంతో బాంబులేసి శబ్దాలు చేసి, ఏనుగును భయపెట్టి అడవిలోకి వెళ్లేలా చేశారు అధికారులు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు హర్షం వెలిబుచ్చారు.