'చిత్రలహరి' టైటిల్ వెనుక అసలు కథ అదేనట!

  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి'
  • తేజు సరసన ఇద్దరు హీరోయిన్లు 
  • త్వరలో సెట్స్ పైకి  
మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసినా .. యూత్ లో క్రేజ్ వున్నా కొంతకాలంగా సాయిధరమ్ తేజ్ కి హిట్ దొరకడం లేదు. వరుస పరాజయాలతో సతమతమైపోతోన్న ఆయన, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దాంతో ఈ సినిమాకి ఇంత సాఫ్ట్ టైటిల్ పెట్టడానికి కారణమేమై వుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఒకరి పేరు 'చిత్ర' కాగా ..  మరొకరి పేరు 'లహరి'. ఈ ఇద్దరితో హీరో కొనసాగించే ప్రేమ ప్రయాణమే 'చిత్రలహరి' అని తెలుస్తోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో తేజు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట .. ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.  
Go Back to Shorts
saidharam tej

More Telugu News