గరీభ్ నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాటలో 15 మంది భక్తులకు గాయాలు
- బీహార్ ముజఫర్ పూర్ లో ఉన్న గరీభ్ నాథ్ ఆలయం
- ఉత్తరాదిన శ్రావణమాసం మూడో సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు
- పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, ఆలయ సిబ్బంది
ఈ రోజు శివుడికి అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు కావడంతో, భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో, అక్కడ తోపులాట చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆలయ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత భక్తులంతా క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.