మళ్లీ కన్నుగీటిన రాహుల్.. జైపూర్ ఎన్నికల ప్రచార సభలో సరదా సన్నివేశం!
- జైపూర్ ఎన్నికల సభలో కన్ను గీటిన రాహుల్
- అశోక్ గెహ్లట్ను ఆలింగనం చేసుకున్న సచిన్ పైలట్
- తమ మధ్య విభేదాలు లేవని చెప్పే యత్నం
ఇటీవల పార్లమెంటులో కన్ను గీటిన రాహుల్ బహిరంగ సభల్లో మాత్రం కన్ను గీటడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తిచేసి వెళ్లి ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సీట్లో కూర్చుని పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతను చూస్తూ కన్నుకొట్టారు. అప్పట్లో ఇది వైరల్ అయింది. మళ్లీ ఆదివారం కూడా ప్రసంగాన్ని ముగించిన వెంటనే రాహుల్ కన్ను గీటడం మరోమారు వైరల్ అయింది.