మీ భార్య భారతి మాత్రమే మహిళా?... శ్రీలక్ష్మి, సబిత, రత్నప్రభల సంగతేంటి?: విరుచుకుపడిన ఏపీ మంత్రులు
- శ్రీలక్ష్మి జైలుకు వెళ్లినప్పుడు లేఖలు రాయలేదేం?
- వారు మహిళలన్న సంగతి గుర్తుకు రాలేదా?
- జగన్ పై మండిపడ్డ కళా వెంకట్రావు, దేవినేని, చినరాజప్ప
చేసిన తప్పులకు పశ్చాత్తాప పడి, అవినీతి డబ్బును ప్రభుత్వపరం చేసి, కేసులు లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని, నెల రోజుల క్రితం చార్జిషీట్ ను ఈడీ దాఖలు చేస్తే పత్రికలకు సమాచారం రాకుండా ఎలా ఉంటుందని హోమ్ మంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. జగన్ దోచుకున్న సొమ్మునంతా ప్రజలకు ఇచ్చేయాలని మరో మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలూ ఉండబట్టే భారతి పేరును నిందితురాలిగా చేర్చి ఉంటారని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించగా, తన భార్య పేరు బయటకు రావడంతో జగన్ బెంబేలెత్తారని ఆనంద బాబు అన్నారు. తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడుతూ, అధికారులను భయపెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.