ఖరీదైన కారును గిఫ్ట్‌గా పొందిన 'ఆర్ ఎక్స్100' చిత్ర దర్శకుడు
- హీరోల క్రేజ్ ను పెంచే దర్శకులు
- నిర్మాతలకి లాభాలు తెచ్చే దర్శకులు
- అందుకే పెరుగుతోన్న ప్రాధాన్యత
తమిళంలో అజిత్ .. సూర్య .. విజయ్ లు ఇలా కార్లను దర్శకులకు గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఆ మధ్య 'శ్రీమంతుడు' హిట్ అయినప్పుడు మహేశ్ బాబు .. కొరటాలకి ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ లాభాలను తెచ్చిపెట్టిన దర్శకుడు అజయ్ భూపతికి .. నిర్మాత అశోక్ గుమ్మకొండ ఖరీదైన 'జీప్' కారును కానుకగా అందజేశారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.