భర్త వేధింపులు భరించలేక ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
- ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అధికారిణి
- భర్త, అత్త కారణమంటూ సూసైడ్ నోట్
- కేసు పెట్టని బాధిత కుటుంబ సభ్యులు
ఈ క్రమంలో బిన్నీ శర్మ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి భర్త, ఆమె తల్లే కారణమని పేర్కొంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణవార్త విని భర్త వస్తాడని భావించినా రాకపోవడం, సెల్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బిన్నీశర్మ కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ విషయాన్ని ఆలోచిస్తామని చెప్పడంతో పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.