Tollywood: అమ్మాయిలను ఓరకంటితో చూస్తున్న మహేష్... 'మహర్షి' టీజర్ చూసేయండి!

  • ఘట్టమనేని అభిమానులకు డబుల్ ఫీస్ట్
  • ఈ ఉదయం 'మహర్షి' టైటిల్, ఇప్పుడు టీజర్
  • అదరగొడుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఘట్టమనేని అభిమానులకు డబుల్ ఫీస్ట్ అందింది. ఈ ఉదయం మహేష్ 25వ సినిమా పేరు 'మహర్షి' అని రివీల్ చేసిన చిత్ర టీమ్, కొద్దిసేపటి క్రితం టీజర్ ను బయటకు వదిలింది. 'హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్' అంటూ ప్రారంభమయ్యే టీజర్ లో 'మీట్ రిషి' అంటూ క్యాప్షన్ ఇచ్చి మహేష్ కాలేజీకి వెళుతున్న దృశ్యాన్ని చేర్చారు.

హాఫ్ హ్యాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకుని స్టయిల్ గా మహేష్ నడిచివస్తూ, తన కాలర్ ను సవరించుకుని, ఎదురుగా వస్తున్న అమ్మాయిలను ఓరకంటితో చూసి, ఆపై వెనక్కు తిరిగి చూసి చిరునవ్వు నవ్వుతుండటం కనిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ టీజర్ వ్యూస్ అప్పుడే లక్షల్లోకి వెళ్లిపోయింది.
Tollywood
Maharshi
Prince
Teaser

More Telugu News