Nicholus Bett: ఘోర రోడ్డు ప్రమాదంలో '400 మీటర్స్ హర్డిల్స్' వరల్డ్ చాంపియన్ మృతి!

  • కెన్యాలో ఘటన
  • నైజీరియా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
  • 2015లో వరల్డ్ గోల్డ్ మెడల్ సాధించిన నికోలస్
కెన్యా స్టార్ అథ్లెట్, 400 మీటర్ల హర్డిల్స్ వరల్డ్ చాంపియన్ నికోలస్ బెట్ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన వయసు 28 సంవత్సరాలు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా చాంపియన్ షిప్ లో పాల్గొని తిరిగి వస్తున్న నికోలస్, నార్త్ వెస్ట్ కెన్యా ప్రాంతంలోని నండి సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తూ, అదుపుతప్పినట్టు తెలుస్తోంది.

2015లో చైనాలో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో 800 మీటర్ల కన్నా తక్కువ దూరం పరుగులో ప్రపంచ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన తొలి కెన్యన్ గా నికోలస్ బెట్ నిలిచి చరిత్ర సృష్టించాడు. నికోలస్ మరణాన్ని ధ్రువీకరించిన కెన్యా క్రీడల శాఖా మంత్రి రషీడ్ ఇచేశా, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
Nicholus Bett
Road Accident
World Gold Champions

More Telugu News