కరుణానిధి మరణవార్త తెలిసి తట్టుకోలేక ఆగిన గుండె.. ఇద్దరు అభిమానుల మృతి!
- రాష్ట్రం మొత్తం కన్నీటి సంద్రం
- గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు
- సంయమనం పాటించాలన్న నేతలు
మంగళవారం సాయంత్రం కరుణ మరణవార్త తెలిసిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు పగిలేలా ఏడ్చి అలాగే కుప్పకూలిపోయారు. గుండెపోటుతో వీరు మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. విషయం తెలిసిన డీఎంకే నేతలు సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులను కోరుతున్నారు.
కరుణానిధి మరణవార్త తెలిసినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.