Kollu Ravindra: ఏపీకి వీళ్లిద్దరే శని అనుకుంటే, జీవీఎల్ మరో శనిలా దాపురించాడు!: మంత్రి కొల్లు రవీంద్ర

  • ఏపీకి జగన్, పవన్ కల్యాణ్ లే శనిలా పట్టారు
  • పీడీ అకౌంట్స్ పై  జీవీఎల్ వి తప్పుడు ఆరోపణలు
  • ఆ అకౌంట్స్ లో అవినీతికి ఆస్కారం లేదు
ఏపీకి జగన్, పవన్ కల్యాణ్ లే శనిలా పట్టారనుకుంటే, బీజేపీ నుంచి జీవీఎల్ మరో శనిలా దాపురించాడని మంత్రి  కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీడీ అకౌంట్స్ పై  జీవీఎల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసలు, ఆ అకౌంట్స్ లో అవినీతికి ఆస్కారం లేదని అన్నారు.
 
కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ కు అవగాహన లేదు

మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ కు అవగాహన లేదని, తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఏపీలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 25 ఎంపీ సీట్లూ తామే గెలుస్తామని, రాష్ట్రానికి న్యాయం చేసేవారినే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు. అమరావతిలో నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణపు పనులూ ఇంత వేగంగా జరగలేదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం 3 వేల 600 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఏడాది ఆఖరకు ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం మినహా అన్ని నిర్మాణాలు వచ్చే మార్చి నాటికి పూర్తవుతాయని అన్నారు.
Kollu Ravindra
narayana

More Telugu News